- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలుడు కాదు.. దగ్గరి బంధువే......!
నాగర్ కర్నూల్ జిల్లా స్కానింగ్ సెంటర్ లో శిశువుకు జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కి సంబంధించిన కేసు సస్పెన్స్ వీడినట్లుగా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా స్కానింగ్ సెంటర్ లో శిశువుకు జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కి సంబంధించిన కేసు సస్పెన్స్ వీడినట్లుగా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని ఓ కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడు రోజుల క్రితం అనారోగ్యం పేరుతో జిల్లా కేంద్రంలో వైద్య సేవలకు వచ్చి స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేసుకోవడానికి వెళ్లి పసిబిడ్డకు జన్మనిచ్చిన అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా ఆ విద్యార్థిని సంవత్సరం క్రితం తనతో పాటు పరీక్షలు రాసిన విద్యార్థితో ఉన్న పరిచయం.. ప్రేమ కారణంగా ఒకటి అయ్యాము అని.. ఈ కారణంగానే తాను గర్భం దాల్చడం జరిగిందని మొదట్లో తెలియజేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఆ మైనర్ బాలుడిని తీసుకువచ్చి విచారణ జరిపాం. బాలికతో పరిచయం ఉన్నది నిజమే.. ఫోన్ లో మాట్లాడడం.. చాటింగ్ చేయడం మినహాయిస్తే ఎటువంటి తప్పు చేయలేదు అని మైనర్ బాలుడు పోలీసులకు గట్టిగా చెప్పడంతో ఇందులో మరేదో ఉంది అని ఆ విద్యార్థిని మరోసారి విచారించామని డీఎస్పీ తెలిపారు. బాలుడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిజా నిజాలు తెలుస్తామని చెప్పడంతో ఆ విద్యార్థిని నిజం చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు, వివాహితుడు అయిన గంగరాజు కారణంగా గర్భం దాల్చినట్లు విద్యార్థిని చెప్పిందని డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. వెంటనే గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు అని డీఎస్పీ వివరించారు. ఈ మేరకు తమ అదుపులో ఉన్న మైనర్ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించి.. గంగరాజు పై పోక్సోకేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. రాళ్లతో కొట్టి హత్య చేసిన భర్త
తన భార్యతో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గౌరారం గ్రామంలో మార్చి 01న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ కు చెందిన అన్నుల దాసి జగన్మోహన్ గుంపు మేస్త్రీ గా పని చేస్తున్నాడు. బిజినెపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి మనుషులను పెబ్బేరుకు చెందిన సత్యం కు గుంపు తయారు చేసి పంపించేవాడు. ఈ క్రమంలో గౌరవరం గ్రామానికి చెందిన పరశురాములతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పరశురాములు భార్య అయిన పార్వతమ్మతో జగన్మోహన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం అతని భర్త చూసి జగన్మోహన్ ను ఊరి బయటికి తీసుకువెళ్లి కల్లు తాగించారు. పరశురాములు, అతని భార్య పార్వతమ్మ, మరో వ్యక్తి నాగరాజు కలిసి జగన్మోహన్ ని రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో మార్చురికి తరలించారు. మృతుని అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ తెలిపారు.






