- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం
ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, మిడ్జిల్ : ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మిడ్జిల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జడ్చర్ల లో రైతులు పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారని రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే దాన్యం కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. దీంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. గత రెండేళ్ల నుండి బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై ఆరోపణలు చేస్తున్నాడు కానీ ఆరోపణలు నిజం చేసేలా ఎలాంటి రుజువు చూపించలేకపోయాడని అన్నారు.
లారీల కొరత , గన్ని బ్యాగుల సమస్య ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీస అవగాహన లేని ప్రభుత్వం కు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని గుర్తు చేశారు. వెంటనే అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ సభ పెడితేనే రైతుబంధు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ రామ్ చెప్పిందని అన్నారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని, సర్పంచులకే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి క్షమాపణలు చెప్పాలని సూచించారు. విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు పాండు , నాయకులు జంగి రెడ్డి, బరిగెల సుదర్శన్ , శ్రీనివాస్ గౌడ్, సుకుమార్ , కాడయ్య, గోపాల్, శ్రీనివాసులు, గంజి కృష్ణ, ఆచారి, భీమ్ రాజు, రవీంద్ర, నవీన్, వెంకటయ్య, విజయ్, రాఘవేందర్, జగన్ గౌడ్, శ్రీశైలం, శ్రీనివాసులు, భాస్కర్ తదితరులు ఉన్నారు.






