- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాదచారులకు ప్రకృతి వరం
మండల పరిధిలోని రుద్రారం గ్రామం నుంచి కూచూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రుద్రారం గేట్ సమీపంలో ప్రకృతి అందాలు ఆహ్లాదకరంగా అలరిస్తున్నాయి. రో

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని రుద్రారం గ్రామం నుంచి కూచూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రుద్రారం గేట్ సమీపంలో ప్రకృతి అందాలు ఆహ్లాదకరంగా అలరిస్తున్నాయి. రోడ్డుకు ఇరు వైపులా విరివిగా పెరిగిన చెట్లు ఒకదానికొకటి అల్లుకుపోయి సహజ పందిరిలా మారి ప్రయాణికులకు చల్లని నీడను అందిస్తున్నాయి. ఎండ వేడి తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ఈ చెట్ల నీడ పాదచారులకు, వాహనదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఈ అందాల మధ్య గ్రామస్తులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. కూచూరు, ఇప్పటూర్, దొడ్డిపల్లి, కారూరు, మల్లారెడ్డిపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రోజువారీ ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. బస్సులు లేకపోవడంతో ఈ మార్గంలో నడిచే పాదచారులు చెట్ల నీడలో కొంత సేపు విశ్రాంతి తీసుకుంటూ వెళ్లే వాహనాలను ఆపి లిఫ్టులు అడుగుతూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రసాదించిన ఈ పచ్చని పందిరి ఒకవైపు అందాన్ని చాటుతుండగా.. మరోవైపు ప్రాథమిక రవాణా సౌకర్యాల లేమి కారణంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






