ఉమ్మ‌డి కుటుంబాన్ని విడదీసిన మున్సిప‌ల్ ఎన్నికలు

by Ratna Kumari |

క‌లిసి మెలిసి ఉన్న‌టువంటి ఉమ్మ‌డి కుటుంబాన్ని మున్సిప‌ల్ ఎన్నిక‌లు విడ‌దీశాయి.

ఉమ్మ‌డి కుటుంబాన్ని విడదీసిన మున్సిప‌ల్ ఎన్నికలు
X

దిశ‌, మ‌క్త‌ల్ : క‌లిసి మెలిసి ఉన్న‌టువంటి ఉమ్మ‌డి కుటుంబాన్ని మున్సిప‌ల్ ఎన్నిక‌లు విడ‌దీశాయి. ముఖ్యంగా అన్న‌ద‌మ్ములు, ఇంటి కోడ‌ళ్లు, అక్కా చెల్లెల్లు మ‌ధ్య ఆస్తి త‌గాదాలు జ‌రుగుతుండ‌టం మ‌నం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఎన్నిక‌లు కూడా కుటుంబాల‌ను ఈ మ‌ధ్య కాలంలో చీల్చుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో త‌ల్లి, కొడుకు, అన్న‌-త‌మ్ముడు, అత్తా-కోడ‌లు, వ‌దిన‌-మ‌ర‌ద‌లు ఇలా ర‌క‌ర‌కాలుగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటారు. తాజాగా మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 6వ వార్డు ఎస్టీకి రిజ‌ర్వేష‌న్ అయింది. అయితే మున్సిపాలిటీ ఏర్ప‌డిన స‌మ‌యంలో చందాపురం పంచాయ‌తీ ఆమ్లెట్ గా ఉన్న తిర్లాపూర్, గార్ల‌ప‌ల్లి గ్రామాల‌ను క‌లుపుకొని మ‌క్త‌ల్ మున్సిపాలిటీ గా ఏర్పాటు అయింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చందాపూర్ ఆరవ వార్డు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో ఆ వార్డు పై ఆశలు పెట్టుకున్న మున్సిపాలిటీలోని పలు పార్టీల నాయకుల ఆశలు అడి ఆశ‌ల‌య్యాయి. పోటీ చేయ‌డానికి అవ‌స‌రం ఉండ‌టంతో ఆ గ్రామంలో నివ‌సిస్తున్న ఉమ్మ‌డి కుటుంబంలో ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల వారు మూడు టికెట్లు ఇచ్చి పోటీకి త‌మ అభ్య‌ర్థులు వీరే అని డిక్లేర్ చేసారు. ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో ఎవ్వ‌రూ గెలిచినా మిగ‌తా ఇద్ద‌రికీ ఈర్ష్య, అసూయ పెరుగుతుంది. ఎన్నిక‌ల పుణ్య‌మా..? అని క‌లిసి మెలిసి ఉన్న ప‌చ్చ‌ని ఉమ్మడి కుటుంబాన్ని నిలువుగా చీల్చేసింది. ప్ర‌స్తుతం మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 6వ వార్డు గురించి అంతా చ‌ర్చించుకోవ‌డం విశేషం.

Next Story