రేపు మ‌క్త‌ల్ లో మున్సిప‌ల్ బ‌డ్జెట్ స‌మావేశం

by Ratna Kumari |

మ‌క్త‌ల్ మున్సిపాలిటీ బ‌డ్జెట్ స‌మావేశం సోమ‌వారం చైర్మ‌న్ మాన‌స‌, క‌మిష‌న‌ర్ శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో రూ.10 కోట్ల అంచ‌నాల‌తో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

రేపు మ‌క్త‌ల్ లో మున్సిప‌ల్ బ‌డ్జెట్ స‌మావేశం
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ మున్సిపాలిటీ బ‌డ్జెట్ స‌మావేశం సోమ‌వారం చైర్మ‌న్ మాన‌స‌, క‌మిష‌న‌ర్ శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో రూ.10 కోట్ల అంచ‌నాల‌తో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. మున్సిపాలిటీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ గా రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఆ పార్టీ ఏక‌గ్రీవంగా ఎంపిక చేసింది. నాలుగు కో ఆప్ష‌న్ స‌భ్యుల‌ను ఎంపిక కు 8 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఒక నామినేష‌న్ రిజెక్ట్ కావడంతో 7 ద‌ర‌ఖాస్తులు ఓకే అయ్యాయి. అందులో రెండు మైనార్టీ మేల్, ఫీమేల్, సీనియార్టిలో మేల్, ఫీమెల్ ఇద్ద‌రినీ నాలుగు కో ఆప్ష‌న్ స‌భ్యులుగా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో ఉన్న 15 మంది మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు న‌లుగురిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు.


మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ఏర్ప‌డిన త‌రువాత రెండో దెబ్బ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 12 మంది కౌన్సిల‌ర్ల‌ను గెలుచుకొని మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వీని కాంగ్రెస్ ద‌క్కించుకుంది. రెండేళ్లుగా పాల‌క‌వ‌ర్గం లేక‌పోవ‌డంతో క‌మిష‌న‌ర్ పాల‌న వ్య‌వ‌హారాన్ని చూసుకునే వారు చెల్లింపులకు అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో మున్సిపాలిటీ వ్య‌వ‌హారాల‌ను కొన‌సాగించే వారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పాల‌న మండ‌లి అధికారంలో ఉండ‌టంతో మున్సిపాలిటీ బ‌డ్జెట్ ను ప్రవేశ‌పెడుతున్నారు. మ‌క్త‌ల్ మున్సిపాలిటీ ప‌ద్దుల ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు దిన‌స‌రి కూలీలు.. సిబ్బంది జీతాలు, పారిశుధ్య కార్య‌క్ర‌మానికి ఉప‌యోగించే ముడి స‌రుకులు, వాహ‌నాల ఖ‌ర్చుల‌ను ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను నివేదిక రూపొందించి మ‌క్త‌ల్ మున్సిపాలిటీకి వ‌చ్చే ఆదాయాన్ని అంచెనా వేసి ప్ర‌ణాళిక బ‌ద్దంగా నివేది రూపొందించి రాబ‌డులు, ఖ‌ర్చుల ప‌ద్దుల‌తో నివేదిక‌ను బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Next Story