తుంగ‌భ‌ద్ర లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్

by Ratna Kumari |

దిశ‌, అలంపూర్/అలంపూర్ టౌన్ : ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు తుంగభద్ర నదిలో గురువారం ఎన్డిఆర్ఎఫ్ , డిడిఆర్ఎఫ్ బృందాలచే మాక్‌ డ్రిల్‌ ( Mock Drill )

తుంగ‌భ‌ద్ర లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్
X

దిశ‌, అలంపూర్/అలంపూర్ టౌన్ : ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు తుంగభద్ర నదిలో గురువారం ఎన్డిఆర్ఎఫ్ , డిడిఆర్ఎఫ్ బృందాలచే మాక్‌ డ్రిల్‌ ( Mock Drill ) నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం తుంగభద్ర నదిలో మాక్ డ్రిల్ నిర్వహించింది. స్పెషల్ బోట్ల సహాయంతో శిక్షణ ఇచ్చారు. ప్రకృతి విపత్తులు ఎదురైన సమయంలో వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయాలలో తమను తమచుట్టు ఉన్న ప్రజలను ఏ లా కాపాడుకోవాలో మాక్‌ డ్రిల్‌ తో తెలియజేశారు. లోతైన నీటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ద్వారా రెస్క్యూ టీం పనివిధానాన్ని వివరించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల విన్యాసాలను పట్టణ ప్రజలు విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. విపత్తు లు సంభవించిన సమయంలో ఎన్‌డీఆర్‌ఎప్‌ ( NDRF ) తరహాలో డీడీఆర్‌ఎఫ్‌ ( DDRF ) ఏర్పాటైందని, భద్రతా పరంగా ఎలాంటి సమస్య లు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఎన్డిఆర్ఎఫ్ చీఫ్ దేవేంద్ర సింగ్ పేర్కొన్నారు . తీర ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరుగకుండా ఆలయ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో మంజుల ఎస్సై వెంకటస్వామి ఎంఈఓ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Next Story