వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

by Ratna Kumari |

దిశ‌, చార‌కొండ : మొంథా తుఫాన్ కార‌ణంగా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో చార‌కొండ మండ‌లం తుర్క‌ల ప‌ల్లి గ్రామంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీవో అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే డాక్ట‌ర్

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
X

దిశ‌, చార‌కొండ : మొంథా తుఫాన్ కార‌ణంగా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో చార‌కొండ మండ‌లం తుర్క‌ల ప‌ల్లి గ్రామంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీవో అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే డాక్ట‌ర్ వంశీ కృష్ణ సంద‌ర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని భ‌రోసా క‌ల్పించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారని వివ‌రించారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దనీ, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో, మట్టి ఇండ్లలో, విద్యుత్ స్థంబాల ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌ద‌ని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులు అంద‌రూ అప్రమత్తంగా ఉండి పరిస్థితులను పర్యవేక్షించాల‌ని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా చెరువులు వాగులు ప్రవహిస్తున్న ప్రదేశంలోకి వెళ్లకూడదని ఎమ్మెల్యే సూచించారు.

Next Story