- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీను మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన శ్రీను మృతదేహానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాళులర్పించారు.

దిశ, శ్రీరంగాపూర్ : మండల కేంద్రంలో సోమవారం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన వసంతపురం ఏదుట్ల శ్రీను తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో కరిగట్టు ముగించుకొని, వరి మడి ఎక్కే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ శ్రీను ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం విషయం తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్లో శ్రీను మృతదేహాన్నికీ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను మరణం చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వారితో పాటు టీపీసీసీ బీసీ విభాగం ఉపాధ్యక్షులు, మాజీ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఎస్ఐ హిమబిందు, గ్రామ సర్పంచ్ మద్దిలేట్టి, గ్రామస్తులు ఉన్నారు.






