- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, దేవరకద్ర : మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ హాజరై మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేవరకద్ర పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, కమిషన్లు వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులను చేయలేదని, అండర్పాస్ నిర్మించాల్సిన చోట ఫ్లైఓవర్ నిర్మించి దేవరకద్రను రెండుగా చీల్చారని గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉండి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఒక డిగ్రీ కాలేజ్ ను తీసుకు రాలేదని, హాస్పిటల్ ను నిర్మించలేదని, కోర్ట్ ను ఏర్పాటు చేయలేదని, దేవరకద్ర పట్టణాన్ని మున్సిపాలిటీగా గుర్తించలేదని గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశామని, కాలేజ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఆరు కోట్ల నిధులు కేటాయించిందని, త్వరలో డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణాన్ని చేపడతామని అన్నారు.
ఇప్పటికే 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, పనులుప్రారంభమయ్యాయని, త్వరలో పనులు పూర్తవుతాయని, అదేవిధంగా తొందర్లోనే కోర్టుకార్యకలాపాలు మొదలవుతాయని అన్నారు. ఇటీవల 25 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామని, నేడు అయిదు కోట్ల నిధులతో నూతన మున్సిపల్ ఆఫీస్ కు సంబంధించిన భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని, దేవరకద్ర మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను మంజూరుచేశామని, పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం దేవరకద్ర పట్టణంలో ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, మన ప్రభుత్వం దేవరకద్ర పట్టణంలో మొదటి విడతలో 71 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని అన్నారు. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదగాలని కోరారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని, మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహించుకొనేలా ప్రోత్సహించామన్నారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలకు యజమానులను చేశామన్నారు, వడ్డీలేని రుణాలు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ పంప్ ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారీ పెట్టి గౌరవించాలని ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.






