- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సలేశ్వరంలో తప్పిపోయిన గాయత్రి ఆచూకీ ఇంకా దొరకలే..
by Taduka Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతర ఉత్సవాలలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం రాయచూరు ప్రాంతానికి చెందిన గాయత్రి తప్పిపోయిన విషయం తెలిసిందే.

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతర ఉత్సవాలలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం రాయచూరు ప్రాంతానికి చెందిన గాయత్రి తప్పిపోయిన విషయం తెలిసిందే. గాయత్రి కోసం రెండు రోజుల నుంచి అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగులు అడవిలో గాలిస్తూనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం పొద్దుపోయే వరకు వెతికినా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదని మన్ననూర్ అటవీ క్షేత్ర అధికారి ఈశ్వర్ తెలిపారు. గాలింపు చేస్తున్న వారిలో 30 మంది వాలంటీర్లు, 20 మంది బేస్ క్యాంప్ వాచర్లు, గురువయ్య, రాజు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్ ప్రవీణ్ లు ఉన్నారు.
Next Story






