- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడమటి అంజన్న తిరునాళ్ల పై అధికారులతో మంత్రి సమీక్ష
దిశ, మక్తల్ : పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై గురువారం మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిని కవిత వంశపారం ప

దిశ, మక్తల్ : పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై గురువారం మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిని కవిత వంశపారం పర్య ధర్మకర్త ప్రాణేష చారి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరై సమీక్షనిర్వహించారు. అంతకుముందు మంత్రి స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరించారు. గత 100 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న కోనేరును పూడిక తీసి అందంగా తీర్చిదిద్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఈ కోనేటిని భక్తులకు అందుబాటులో తీసుకొచ్చేలా సిద్దం చేశామని.. కోనేరు నీటితోనే స్వామి వారి అభిషేకాలు జరగాలని, దీంతో పాటు ప్రతి భక్తుడు కోనేటిలో స్నానం చేసిస్వామి దర్శించుకునేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 02 నుంచి డిసెంబర్ 09 వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వివిధ అంశాలపై చర్చించారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని తిరునాళ్ల ప్రారంభం నుంచి దీపాల అలంకరణ స్వాగత తోరణాలు, భారీ ఆంజనేయ స్వామి కటౌట్లు, అయోధ్య రామ మందిర నమూనాలతో విద్యుత్ దీపాలంకరణ చేయాలని అందుకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. మక్తల్ పట్టణానికి చేరుకునే అన్ని రహదారుల్లో పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటను చేయాలని పోలీసులను ఆదేశించా రు. దీంతో పాటు భక్తులకు స్వామివారికి నైవేద్యం చేసేందుకు స్థలం నీటి సౌకర్యం ఉండేలా నీటి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రబోత్సోవం, రథోత్సవం, పాలవుట్ల కార్యక్రమంలో భక్తుల తాకిడి తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, విద్యుత్ శాఖ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ డిపో మేనేజర్ అధికారులు పాల్గొన్నారు.






