తూకం చీరలు కాదు.. నేత చీరలు ఇస్తున్నాం : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |   (  Updated:2025-11-22 09:24:51  IST  )

దిశ‌, మ‌క్త‌ల్ : తెలంగాణలోని మహిళలకు సస్తా బజార్లో తూకంతో కొన్నచీరలు కాకుండా తమ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను ఆడవారికి గౌరవంగా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

తూకం చీరలు కాదు.. నేత చీరలు ఇస్తున్నాం : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : తెలంగాణలోని మహిళలకు సస్తా బజార్లో తూకంతో కొన్నచీరలు కాకుండా తమ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను ఆడవారికి గౌరవంగా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐకేపీ మ‌హిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి హాజరై పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ‌త ప్రభుత్వం ఇచ్చిన చీరలను పంట పొలాల చుట్టూ రక్షణ కోసం కట్టే రకంగా ఉండేవని.. వాటిని తెలంగాణ మహిళలు తీసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదన్నారు. కానీ తమ ప్రభుత్వం చేనేత సొసైటీలకు స్వయం ఉపాధి పనులు కల్పించేందుకు రాష్ట్రంలో పేరు పొందిన సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను మహిళలు కొద్ది రోజులపాటు ధరించేలా నాణ్యమైన చీరలను ఇస్తున్నామన్నారు. రకరకాల డిజైన్లతో చీరలతో మహిళల మధ్యన బేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. మహిళల మధ్యన బేధాలు రాకుండా రెండు రకాల డిజైన్లతో నేసిన చీరలను మహిళకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ దగ్గరనే మరుగుదొడ్లను నిర్మించుకోవాలని అందుకు ఆధార్ కార్డుతో ఆ ఇంటి గృహిణి కలెక్టర్ కి దరఖాస్తు చేసుకుంటే 24 గంటలలో మీకు మంజూరి వస్తుందని ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకమని ప్రతి మహిళ విధిగా మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. మక్తల్ నియోజకవర్గానికి దాదాపు 32వేల చీరలు మంజూరయ్యాయని.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఉచితంగా చీర వస్తుందని, అందుకు ఆధార్ కార్డు తీసుకెళ్లి మహిళా సంఘాల ద్వారా చీరను పొందొచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

Next Story