ప్రపంచ సినీ శిఖరం పై 'నాటు' కున్న తెలంగాణ ఖ్యాతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 12 |
ప్రపంచ సినీ శిఖరం పై నాటు కున్న తెలంగాణ ఖ్యాతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రపంచ సినీ శిఖరం (ఆస్కార్ అవార్డు)పై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి తెలంగాణ ఖ్యాతి 'నాటు'కున్నది అని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. జాతీయ విప్లవ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రూపొందించిన ఈ చిత్రానికి తెలంగాణ బిడ్డ చంద్ర బోస్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీత స్వరాలు దర్శకుడు రాజమౌళి పర్యవేక్షణలో ప్రేమ్ రక్షిత్ అందించిన కొరియోగ్రఫీ.. జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ పోటీపడి నృత్యం చేశారు.

ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఇంత అద్భుతమైన సినిమాను రూపొందించిన దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రచయిత చంద్రబోస్, సంగీత స్వరాలు అందించిన కీరవాణి, పాటలు ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, నిర్మాతలు, చిత్ర యూనిట్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో నిలిచిన "ది ఎలిఫెంట్ మిష్ఫరర్స్" చిత్ర బృందాన్ని సైతం మంత్రి అభినందించారు. రానున్న రోజుల్లో సిని పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

Next Story