అమ్రాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచన మేరకు అమ్రాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన్ననూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రహీమ్ ను నియమించినట్లు ఆదేశాలు జారీ చేశారు.

అమ్రాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచన మేరకు అమ్రాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన్ననూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రహీమ్ ను నియమించినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మండలం లోని ముఖ్య కార్యకర్తలతో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు అబ్దుల్ రహీం ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో చర్చ గోష్టి, సీనియర్ల సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీని మండలంలో బలోపేతం చేయడానికి ప్రణాళికను రూపొందించడానికి పెద్దల సలహాలను సహచరుల ఆలోచనలను స్వీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మండల సీనియర్ కార్యకర్తలు పంబలి బుచ్చయ్య, సంబు వెంకటరమణ, మాజీ మండల అధ్యక్షులు హరి నారాయణ గౌడ్, అచ్చంపేట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులు తిరుపతయ్య గౌడ్, బాల్ లింగం, నిర్మూల వెంకటేశ్వర్లు, సంతోష్ ఎన్ ఎస్ యు సభ్యులు, ఆనంద్, జూలూరు సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాజారామ్ పాల్గొన్నారు.

Next Story