నర్వ PHC లో వైద్యం క‌రువు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-21 03:58:02  IST  )

మండ‌లం ప‌రిధిలోని PHC లో వైద్యం క‌రువైంది. సిబ్బంది అందుబాటులో ఉండ‌టం లేదు.

నర్వ PHC లో వైద్యం క‌రువు
X

దిశ‌, న‌ర్వ : మండ‌లం ప‌రిధిలోని PHC లో వైద్యం క‌రువైంది. సిబ్బంది అందుబాటులో ఉండ‌టం లేదు. క‌నీస సౌక‌ర్యాలు కూడా ఉండ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. తాజాగా ఉరి వేసుకున్న ఓ యువ‌కుడిని న‌ర్వ PHC సెంట‌ర్ వ‌ద్ద‌కు తీసుకొస్తే.. ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. అందులో డాక్ట‌ర్లు లేక‌పోవ‌డంతో అక్క‌డున్న న‌ర్సుని ప్ర‌శ్నిస్తే.. డాక్ట‌ర్లు లేనిది తాము ఎలాంటి ట్రీట్ మెంట్ చేయ‌లేమ‌ని చెప్పారు. డాక్ట‌ర్ మాత్రం PHC వ‌ద్ద అందుబాటులో ఉండ‌టం లేదు. ఈ విష‌యం పై న‌ర్సులు పేషెంట్ల పై, పేషెంట్ బంధువుల‌ను తిట్ట‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి న‌ర్వ PHC సెంట‌ర్ లో వైద్యం అందేలా చూడాల‌ని కోరుతున్నారు.

Next Story