- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేలా అధిష్టానం మాస్టర్ ప్లాన్..!
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంది.

దిశ, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంది. చీరాల క్యాంప్ ముగించుకుని నేడు షంషాబాద్ రిసార్ట్స్‌కు చేరుకున్న 29 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పార్టీ అగ్రనేత ఈ రాత్రి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే, మేయర్ ఎవరనేది ఈ రాత్రే ప్రకటిస్తారని భావించినా, రాజకీయ సమీకరణాల దృష్ట్యా అధిష్టానం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.అభ్యర్థి పేరును ఈ రాత్రే ప్రకటిస్తే తిరిగి వర్గ పోరు మొదలయ్యే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం మేయర్ , వైస్ మేయర్ పేర్లను గోప్యంగా ఉంచాలని నిర్ణయించింది. ఎన్నికల్లో జరగనున్న సోమవారం ఉదయం మేయర్ ఎన్నికకు సరిగ్గా అరగంట ముందు ఫార్మాలిటీస్ను పూర్తి చేసిన తర్వాత అధిష్టానం పంపిన పేరును ‘సీల్డ్ కవర్’ ఓపెన్ చేసి మేయర్, వైస్ మేయర్ ను ప్రకటిస్తారు. అప్పటివరకు సస్పెన్స్ కొనసాగనుంది.
ఓటింగ్ పై శిక్షణ - అగ్రనేత దిశానిర్దేశం
ఈ రాత్రి జరిగిగే సమావేశంలో అగ్రనేత సభ్యులకు కీలక సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్ ఎలా చేయాలి? పార్టీ జారీ చేసే 'విప్'ను ఎలా పాటించాలి? సాంకేతిక కారణాలతో ఓటు వృధా కాకుండా ఎలా జాగ్రత్త పడాలి? అనే అంశాలపై కార్పొరేటర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థుల మధ్య ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా, ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా సాగేలా పర్యవేక్షించే బాధ్యతను ఈ కీలక నేత భుజాన వేసుకున్నారు.
పదవి కోసం పోటా పోటీ
మహబూబ్ నగర్ మొదటి మేయర్ గా బాధ్యతలను స్వీకరించినందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, సీనియర్ కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రి సతీమణి హజీరా బేగం, ఏకగ్రీవంగా ఎంపికైన రమ శ్రీనివాసరాజు పోటీపడుతున్నారు. మేయర్ ఎంపిక విషయములో నిర్ణయం అధిష్టానిదే అయినప్పటికిని.. పలువురు కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పదవిని కట్ట పెట్టేందుకు పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. వారి ట్రిక్స్ పనిచేస్తాయా..!? లేక పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.






