- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా దేశంలో ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొన్న మరికల్ అయ్యప్ప
దిశ, మరికల్ : రష్యాలో జరుగుతున్న భారత్, రష్యా, ఉజ్బెకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొన్న మరికల్ పట్టణానికి చెందిన అయ్యప్ప అడ్వకేట్ ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు

దిశ, మరికల్ : రష్యాలో జరుగుతున్న భారత్, రష్యా, ఉజ్బెకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొన్న మరికల్ పట్టణానికి చెందిన అయ్యప్ప అడ్వకేట్ ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్ దేశంలో తస్కెంట్, రష్యాలోని మాస్కో నగరంలో రష్యా, భారత్, ఉజ్బెకిస్తాన్ యువజన ఎకనామిక్ సమ్మిట్ సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారతదేశం నుండి 20 మంది పాల్గొనడం జరిగింది. అందులో మరికల్ కి చెందిన ఎల్.అయ్యప్ప పాల్గొనారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులను. రష్యా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ను. క్రిమియా ప్రభుత్వ సలహాదారులను మాస్కో నగర పాలకమండలి సభ్యులను కలవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనదేశ విద్యార్థులకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యం కలిగిన కార్మికులను అక్కడికి పంపాలని అధికారులు కోరడం జరిగింది. ముఖ్యంగా క్రిమియా ప్రాంత అధికారులు బంగారంతో ఆభరణాలు చేసే నైపుణ్యం కలిగిన కార్మికులు వారికి కావాలని నైపుణ్యం కలిగిన చాలా మంది కార్మికులు వారికి అవసరం ఉందని రష్యా, ఉక్రెన్ యుద్ధం తర్వాత అక్కడ కార్మికుల అవసరం చాలా ఉందని ఉద్యోగ అవకాశాల కోసం మేము స్వాగతం పలుకుతున్నామని అధికారులు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రఖ్యాతిగాంచిన అలుగుగా కంపెనీ ప్రతినిధులతో మన దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో వాళ్లకు కావాల్సిన ఏ అంశాలు లేబర్ కావాలో తెలియజేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు.






