మండల రెవెన్యూ కార్యాలయ తరలింపు పై పునః పరిశీలన చేయాలి : చారకొండ ప్రజలు

by Ratna Kumari |

చారకొండ మండల రెవెన్యూ కార్యాలయ తరలింపు నిర్ణయంపై పునః పరిశీలన చేయాలని మండల కేంద్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు.

మండల రెవెన్యూ కార్యాలయ తరలింపు పై పునః పరిశీలన చేయాలి : చారకొండ ప్రజలు
X

దిశ, చారకొండ : చారకొండ మండల రెవెన్యూ కార్యాలయ తరలింపు నిర్ణయంపై పునః పరిశీలన చేయాలని మండల కేంద్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారకొండ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో లేని దూర ప్రాంతానికి తరలించాలనే అధికారుల నిర్ణయం పట్ల మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, రెవెన్యూ కార్యాలయ తరలింపుతో రైతులు, వృద్ధులు, మహిళలు మరియు పేద ప్రజలు అనవసరమైన ప్రయాణ భారం, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం మండల కేంద్రానికి అనుకూలంగా ఉండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సులభంగా చేరుకునే విధంగా ఉందనీ, కానీ అధికారులు కొంత మంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం మండల ప్రజల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని వారు అధికారులతో తెలిపారన్నారు. సంబంధిత అధికారులు కార్యాలయ తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చారకొండ మండల రెవెన్యూ కార్యాలయ తరలింపు అంశాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు జాలురి అర్జునయ్య గౌడ్, గజ్జె యాదయ్య గౌడ్, సండూరి శ్రీనివాస్ గౌడ్, చీమర్ల నరేందర్ రెడ్డి, కుంభం వెంకటయ్య గౌడ్, కుంభం కొండలయ్య గౌడ్, చింతపల్లి అశోక్ గౌడ్, సవారి గుండె శ్రీను గౌడ్, గుండె శివ గౌడ్, చింతపల్లి శ్రీరాములు గౌడ్, కేశగోని మధు గౌడ్ పాల్గొన్నారు.

Next Story