సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి మృతి

by Elthuri vijay kumar |

బుద్ధారం శివారులో మృతదేహం లభ్యం

సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి మృతి
X

సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి మృతి

-బిజినపల్లి పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదని ఫిర్యాదు

-బుద్ధారం శివారులో మృతదేహం లభ్యం

దిశ, గోపాల్ పేట్: సీతాఫలాల కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన ఘటన బుద్ధారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గోపాల్ పేట పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన డేగ తిక్కన్న (78) ఈనెల 14న ఇంట్లో నుంచి సీతాఫలాల కోసం వెళుతున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో బిజినపల్లి పోలీస్ స్టేషన్లో డేగ బరసావులు ఫిర్యాదు చేశాడు. కాగా, వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండల పరిధిలోని బుద్ధారం శివారులోని వంగూరు భగవంతు పొలం దగ్గర తిక్కన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే తన తండ్రి కరెంటు షాక్ తగిలి చనిపోయి ఉంటాడని అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతుడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story