- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
by Ratna Kumari |
దిశ, గోపాల్ పేట : మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని

X
దిశ, గోపాల్ పేట : మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బుద్దారం గ్రామానికి చెందిన ముచ్చునూరు రవీందర్ గౌడ్(40) గత పదేళ్ల నుంచి తరుచూ మద్యం సేవిస్తున్నాడు. ఫూటుగా మద్యం సేవించి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ గోపాల్ పేట నుంచి ఎదుట్ల గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పడి ఉన్నాడు. అయితే కిందపడిఉన్నాడని వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్యతో పాటు ఇద్దరూ కూతుర్లు ఉన్నారు. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై నరేష్ కుమర్ వెల్లడించారు.
Next Story






