- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jurala Project : జూరాల 10 గేట్లు ఎత్తివేత
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains)లకు కృష్ణానది(Krishna River)కి వరద(Floods) పోటెత్తుతోంది.

దిశ, వెబ్ డెస్క్/జోగులాంబ గద్వాల ప్రతినిధి : కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains)లకు కృష్ణానది(Krishna River)కి వరద(Floods) పోటెత్తుతోంది. భారీ వర్షాలు, వరదతో కృష్ణానదిపై గల ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు(Jurala Project) వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో.. గురువారం సాయంత్రం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా దిగువన గల శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనుంది. కాగా మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, దాని ఉపనదుల్లో ఎన్నడూ లేనంత వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం 66వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం ఉదయం వరకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. జూరాల ఇన్‌ఫ్లో 40,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 82,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.389 టీఎంసీలు నిల్వ చేస్తూ వరద ప్రవాహాన్ని నియంత్రిస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం: 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం: 317.360 మీటర్లు ఉంది. జూరాల ప్రాజెక్టు పై ఆదారపడి ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.






