ఈ శోభాయాత్రను విజయవంతం చేద్దాం

by Naveena |

ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేద్దామని విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంబాబు కోరారు.

ఈ శోభాయాత్రను విజయవంతం చేద్దాం
X

దిశ, నారాయణ పేట ప్రతినిధి: ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేద్దామని విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంబాబు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం విహెచ్ పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి పర్వదినం విజయవంతం చేసిన మాదిరిగానే హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు తప్పకుండా శోభాయాత్రకు హాజరుకావాలన్నారు. శోభాయాత్రను మన సాంప్రదాయ వాయిద్యాలతో, తాళమేళాలతో, చెక్కభజనలు, కోలాటాలు, దాండియా ఆటపాటలతో, మన సంస్కృతి ఉట్టిపడేలా జరుపుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టిన శోభాయాత్రలో హిందూ బంధువులందరూ సాంప్రదాయ వస్త్రాలతో కాషాయ కండువాతో కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో కన్న శివకుమార్, మురళి భట్టాడ్, కడుదాస్ ప్రవీణ్, నీరటి వెంకటేష్, వడ్ల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story