పౌర హక్కుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేద్దాం : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఉపాధ్య‌క్షులు బాల‌య్య‌

by Nallavelli.Anjaneyulu |

Let us make the 3rd Congress of Civil Rights Society a success: Mahabub Nagar Vice President Balaiah

పౌర హక్కుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేద్దాం : మ‌హ‌బూబ్ న‌గ‌ర్  ఉపాధ్య‌క్షులు బాల‌య్య‌
X

దిశ, అచ్చంపేట : పౌర హక్కుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరిగే సభలకు అధిక సంఖ్యలో ఉమ్మడి జిల్లా నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ఆపరేషన్ కగారు వ్యతిరేకిద్దాం ! జీవించే హక్కును కాపాడుకుందాం అన్నారు. పాలకులు చట్టం ప్రకారం నడుచుకోవాలని పౌరహక్కుల సంఘం గత ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకుసాగుతున్నదన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ముందు వరుసలో ఉన్నదనీ పేర్కొన్నారు. నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగం ఉద్యమంపై కొనసాగిన అణచివేత, నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ 1973లో ఆంద్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం శ్రీ శ్రీ అధ్యక్షతన ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. హక్కుల ఉద్యమం బలంగా సాగుతూ, ప్రజలు చైతన్యవంతమవుతున్న పరిస్థితుల్లో రాజ్యమే హంతకులుగా మారి గోపీ రాజన్న, డాక్టర్ రామనాధం, జాపా లక్ష్మారెడ్డి, నర్రా ప్రభాకర్ రెడ్డి. పురుషోత్తం, ఆజం ఆలీలను హత్యచేసి పౌర హక్కుల సంఘాన్ని, హక్కుల ఉద్యమ ప్రజానీకాన్ని, ఒక మేరకు ఆందోళనకు గురి చేసిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బలగాలే కాక ప్రైవేటు హంతక ముఠాల సాయాన్ని తీసుకుని హక్కుల ఉద్యమాన్ని అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించిందనీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కు స్ఫూర్తిని ఎన్ కౌంటర్ పేరుతో తనకు గిట్టని వారిని హతం చేస్తున్న స్థితిని, ఆనాటి నుంచి నేటి వరకు వ్యతిరేకిస్తూనే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నది. పోస్టర్ ఆవిష్కరణలో పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేష్, లక్ష్మీ నారాయణ లు ఉన్నారు.

Next Story