నిరుద్యోగ యువతకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా

by velandi.Saikiran |

ఈ జాబ్ మేళా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఉదయం 11గంటలకు ఐ డి ఓ సి లోని F-30/1 లో నిర్వహించనున్నట్లు

నిరుద్యోగ యువతకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఉదయం 11గంటలకు ఐ డి ఓ సి లోని F-30/1 లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఎస్ ఎస్ సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలని అన్నారు, జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు శిక్షణ అనంతరం గద్వాల, ఐజ, మహబూబ్ నగర్ లోని పుష్కల్ ఆగ్రోటిక్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఎంకేకే, కసం ఫ్యాషన్స్ వంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి ప్రియాంక కోరారు.

Next Story