- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రయాణానికి స్టేషన్ కు వెళ్లాలంటే భయమేస్తుంది
ట్రైన్ లో ఏదైనా ఊరికి వెళ్ళాలని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు వెళ్ళాలంటే ప్రయాణికులు జంకుతున్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ట్రైన్ లో ఏదైనా ఊరికి వెళ్ళాలని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు వెళ్ళాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా స్టేషన్ లోని రెండు, మూడవ ఫ్లాట్ ఫాం లకు చేరుకోవాలంటే ఎడమవైపు దాదాపు రెండు ఫర్లాంగుల పొడవులో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుండి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కు కుడివైపు టికెట్ బుకింగ్ కార్యాలయం ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి చేరుకోవాలంటే కనీసం ఫర్లాంగ్, ఆ తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై మరో రెండు ఫర్లాంగులు నడిచి ఎతైన మెట్లు దిగి ఫ్లాట్ ఫాం కు చేరుకునే లోపు దేవుడు కనిపిస్తాడని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే రిజర్వేషన్ కౌటర్ పెట్టారు. నిత్యం రోజంతా ప్రయాణించే ప్రయాణికుల టికెట్ బుకింగ్ మాత్రం దూరంగా ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, రైల్వే ఆధునికీకరణ పనులు పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు సంవత్సరాలు పట్టొచ్చని, వెంటనే రైల్వే అధికారులు టికెట్ బుకింగ్ ను ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే ఏర్పాటు చేసి తమ బాధలను కొంతైనా దూరం చేయాలని కోరుతున్నారు.






