- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ దొంగల ముఠా అరెస్ట్
జల్సాలు, ఈజీ మనకి అలవాటు పడి చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్స్ స్నాచర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జడ్చర్ల పోలీసులు.

దిశ, జడ్చర్ల : జల్సాలు, ఈజీ మనకి అలవాటు పడి చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్స్ స్నాచర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జడ్చర్ల పోలీసులు. ఈ మేరకు బుధవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 27న జడ్చర్ల మున్సిపాలిటీలోని కృష్ణారెడ్డి కాలనీలో కిరాణా జనరల్ స్టోర్ వద్ద వాటర్ బాటిల్ కొరకై వెళ్లి మహిళా మెడల నుంచి రెండు తులాల పుస్తెల తాడు లాక్కొని చైన్స్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఘటనలో పట్టణ కే కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై మల్లేష్ స్పాట్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. ముగ్గురు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్నమయ్య జిల్లా ఎటిగడ్డపల్లి గ్రామానికి చెందిన రాచూరి హరికృష్ణ 26 మదనపల్లికి చెందిన, షేక్ ఇసాక్,22 మూడే లక్ష్మణ్ నాయక్,33 లు గా గుర్తించారు.
వీరు ఆన్ లైన్ గేమ్ లు.. పేకాట ఆడడం జల్సాలకు ఈజీ మనీ కి అలవాటు పడి భారీగా అప్పులు చేశారని అప్పులు తీర్చడానికి దొంగతనాల బాట పట్టారని డీఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న కర్నూలు లో బైక్ దొంగిలించి గోనెగండ్లలో ఒక మహిళ మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసులు లాక్కొని వెళ్లారని ఫిబ్రవరి 25న ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో యూనికాన్ బైక్ దొంగతనం చేశారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 27న జడ్చర్ల కృష్ణారెడ్డి నగర్ కాలనీలో టైలర్ షాప్ లో ఉన్న మహిళను నీళ్ల బాటిల్ అడిగే ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల్లో రాసూరి హరికృష్ణ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ఇతడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయితో పాటు దొంగతన కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి నాలుగు తులాల బంగారు నగలు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. తక్కువ సమయంలో జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై మల్లేష్, కానిస్టేబుల్ విష్ణు, మన్సూర్, నరసింహ, ఈ కేసును చాకచక్యంగా ఛేదించిననందుకు వారిని అభినందించారు. తమ విలువైన బంగారు నగలను జాగ్రత్తగా దాచుకోవడంతో పాటు అపరిచిత వ్యక్తులు దగ్గరికీ వస్తే.. వారి వద్ద నుంచి దూరంగా ఉండాలని ఎవరికైనా అనుమానం వస్తే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.






