- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన : కలెక్టర్ సంతోష్
దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డు నెం.14లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం

- ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం
- కలెక్టర్ కీలక ఆదేశాలు
దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డు నెం.14లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీ పడకుండా,ప్రతి దశలో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. మున్సిపల్ స్థాయిలో మార్క్ అవుట్, బేస్‌మెంట్ స్థాయి పనులు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.నిర్మాణపు పనులు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులు పూర్తయిన పనుల ఫోటోలను వెంటనే క్యాప్చర్ చేయాలని,లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారు తమ ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకి రాం, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.






