- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి
గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎద్దుల బండ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, క్రైమ్/వనపర్తి : గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎద్దుల బండ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్లో ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడిందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడం కోసం ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని దేశంలో నిత్యవసర వస్తువుల రేట్లు పెరిగి సామాన్య ప్రజల బతుకులు రోడ్డుమీద పడ్డాయని అన్నారు. తక్షణమే ప్రధానమంత్రి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకుంటే రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా ధర్నాలు పెద్ద ఎత్తున చేసి ధరలు దిగేవచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఆపదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు శివసేనా రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.






