- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ కార్యాలయంలో కదలని భూభారతి, సాదా బైనామా పెండింగ్ పైల్స్
భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్, సాదా బైనామా పెండింగ్ కేసుల పరిష్కారం లో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, ధర్మసాగర్ : భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్, సాదా బైనామా పెండింగ్ కేసుల పరిష్కారం లో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలో సాదాబైనామా పైల్స్ కదలడం లేదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సాదా బైనామా కేసుల పరిష్కారం కోసం రైతులు ప్రతిరోజు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులకు ముడుపులు ముడితేనే సాదా బైనామా పైల్స్ పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు గ్రామానికో దళారిని పెట్టుకుని మరి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముడుపులు ఇవ్వని రైతుల సాదా బైనామా పైల్స్ ముందుకు కదలడం లేదనే కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు.
గ్రామాలకు చేరని గ్రామ పాలనాధికారులు
గత ప్రభుత్వం తొలగించిన విలేజ్ రెవెన్యూ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పాలనాధికారులను (జీపీవో) నియమించింది. అయితే జీపీవో ల నియామకం పై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ధర్మసాగర్ తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న జీపీవోల (గ్రామ పాలన అధికారులు) పని తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాదా బైనామా ఎంక్వైరీల విషయంలో అనవసర ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. సాదా బైనామా దరఖాస్తులు సమర్పించిన వారిని ఎంక్వైరీ చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, ధరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. అయితే, “పైసలు ఇచ్చిన వారి పనులు, దళారుల ద్వారా వచ్చినవి మాత్రమే త్వరగా పూర్తి అవుతున్నాయి” అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంక్వైరీలలో చేతివాటం ప్రదర్శిస్తూ కొందరు లాభాపేక్షతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి పై ఉన్నతాధికారులు దృష్టి సారించి, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ సేవలు అందరికీ సమానంగా, అవినీతి రహితంగా అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






