కేసీఆర్ పరిపాల‌న‌లో ప్ర‌జ‌ల చెంత‌కే పాల‌న‌ : మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, రేవల్లి : పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజల చెంతకే పాలనను తీసుకొచ్చి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి

కేసీఆర్ పరిపాల‌న‌లో ప్ర‌జ‌ల చెంత‌కే పాల‌న‌ : మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి
X

దిశ‌, రేవల్లి : పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజల చెంతకే పాలనను తీసుకొచ్చి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి సస్య శ్యామలం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో నాగం తిరుపరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ‌ను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి సాధించారని రైతాంగానికి సాగునీళ్లు, ఉచిత కరెంట్,పెట్టుబడి సాయం చేస్తూ కోటి ఎకరాలకు సాగు నీరు అందించారని కొనియాడారు. ఉత్పత్తులు పెరిగి జీవనోపాధి కలిగి రైతులు రాజులా బ్రతికారన్నారు.దేశంలో రైతు బంధు, రైతు రుణ మాఫీ, రైతు బీమా అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ 1000 గురుకులాలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకు ఉన్నత విద్యావంతులను చేశారని ప్రజలకు పాలన అందుబాటులోకి రావాల‌ని కలెక్టరేట్ లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు.


32వేల కోట్లు ఖర్చు పెట్టీ కట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశామని కేవలం 1000కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్త‌యి రూ.12లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని కానీ కాంగ్రెస్ పార్టీకి పాలమూరు పచ్చబడడం ఇష్టం లేక పడావు పెట్టారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని నాయకులు కస్టపడి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కష్టపడి పనిచేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ స‌మావేశంలో నాగం తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ ఎంపీపీ సేనాపతి, నాయకులు భీమన్న, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, సింగిరెడ్డి శశిధర్ రెడ్డి, పాపులు, గోపాల్ రావు, కోర్పాల తిరుపతయ్య, రామకృష్ణ, పూర్ణ కంటి కిరణ్,జీ రాములు, అల్తాఫ్,కుర్మతి రెడ్డి పాల్గొన్నారు.

Next Story