- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలస జిల్లా కాదు.. జిల్లాకు వలసలు రావాలి : మంత్రి వాకిటి శ్రీహరి
వలసలు పోయే జిల్లా కాకుండా నారాయణపేట జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే జిల్లాగా మారుస్తామని మత్స్య, పాడి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

దిశ, నారాయణ పేట ప్రతినిధి : వలసలు పోయే జిల్లా కాకుండా నారాయణపేట జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే జిల్లాగా మారుస్తామని మత్స్య, పాడి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గాయత్రి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలసల జిల్లా నారాయణపేట ప్రసిద్ధిగాంచిందని.. ఆనాటి వలసల జిల్లా నేడు మక్తల్- కోడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి త్వరలో లక్ష ఎకరాలకు సాగునీరు- తాగునీరు అందించి కృష్ణానది జలాలచే ఈ ప్రాంత రైతుల చెంతకు త్వరలోనే రైతులకు ఆర్థిక భరోసాను కల్పించబోతున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి 282 గ్రామ పంచాయతీలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచులు అందరు కూడా గ్రామాలను ఆర్థిక పట్టుకొమ్మల అన్నారు. యువత విద్యా, వైద్యం, ఉపాధి తదితర రంగాలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించి ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేసినప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేసి వారి సమస్యలను కలెక్టర్ ఆయా విభాగాల అధికారుల దృష్టికి తీసుకొని రావాలని వచ్చిన సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు వెంటనే పరిష్కారం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను ప్రతి అర్హులైన పేదవారికి అందేవిధంగా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలని, ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులను గుర్తించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం సూచించినట్టుగా రూ.5లక్షలు తోటి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించుకోవాలని అనవసర ఆర్భాటాలకు పోయి అప్పులు చేసుకోవద్దని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన సూచించారు. ప్రజలందరూ ప్రజా ప్రతినిధులను గౌరవించి సమస్యల సాధన కోసం సలహా సూచనలు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు ఉచితంగా ఇస్తున్నటువంటి ఇసుకను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయాలని ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఐదు లక్షలతో ఇందిరమ్మ నిర్మించుకోవడం కష్ట సాధ్యమని పలువురు సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకుని రాగా.. శనివారం క్యాబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వాటికి అయ్యే ఖర్చు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకు ఇళ్ల కేటాయింపు విషయాలు క్యాబినెట్ లో చర్చించి ప్రభుత్వ త్వరలోనే శుభవార్త ప్రభుత్వం తెలియజేస్తుందని తెలిపారు.
జిల్లాలో ఉన్నటువంటి ఆయా విభాగాల అధికారులు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సమస్యలను గుర్తించి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సకాలంలో చేరవేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి మనందరం కృషి చేద్దామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ఆర్థికంగా పెద్దపీట వేస్తుందని, మహిళలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ఉపయోగించుకొని ఉపాధి ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ఉపకరణ స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






