- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి జిల్లాల్లో జోరుగా అక్రమ కలప రవాణా..!
వనపర్తి జిల్లాతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో అక్రమ కలప అనుమతుల పేరుతో రాష్ట్రల సరిహద్దులు దాటుతుంది.

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లాతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో అక్రమ కలప అనుమతుల పేరుతో రాష్ట్రల సరిహద్దులు దాటుతుంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను నరికేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ఏటా కోట్లాది రూపాయలను ప్రజాధనం ఖర్చు చేస్తుంటే. అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు అధికారులకు నెలనెలా ముడుపులు ముట్ట చెబుతున్నాము అనే ధీమతో అక్రమార్కులు విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. వనపర్తి జిల్లాలోని పలు మండలాలతో పాటు గోపాల్ పేట మండలం నుంచి జోరుగా నిత్యం కలప రవాణా సాగుతుంది. అటవి ప్రాంతంలోని వేప, తుమ్మ, చింత ,చెట్లను దర్జాగా నరికేస్తూ ట్రాక్టర్ లేదా లారీల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కలప వ్యాపారస్తులు ఉండగా వీరికి ఏజెంట్లుగా మరికొంతమంది ఉన్నట్లు సమాచారం.
మామూలు ఎవరికీ..?
కలప అక్రమ రవాణా పై అటవీశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ దందా సాగిస్తున్న వ్యాపారుల నుంచి నెల నెల మామూలు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్జిల్లుతుందని ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడు తూతు మంత్రంగా కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పక్క జిల్లా,రాష్ట్రాలకు దాటిస్తున్నట్లు సమాచారం. బొగ్గుబట్టిల నిర్వహణ కోసం కంపతార, రేగి చెట్ల కోసం అనుమతి తీసుకుంటున్న సదురు వ్యక్తులు విలువైన కర్రను అందులో ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇలా జరుగుతున్న అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే భవిష్యత్తులో వనపర్తి జిల్లాల్లో ఎన్ని మొక్కలు నాటిన నిష్పయోజనమేనని పలువురు పేర్కొనడం గమనార్హం.






