డాక్టర్ సీటు వచ్చింది.. చదువుకుంటా ఆర్థిక సహాయం చేయండి..!

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ మండ‌లం చిట్యాల గ్రామానికి చెందిన ఆదివాసి ఏక‌ల‌వ్య బిడ్డ ఎస్. ఇందుకి ప్ర‌తిమ ప్రైవేట్ మెడిక‌ల్ క‌ళాశాల వ‌రంగ‌ల్ లో ఎంబీబీఎస్ సీటు ల‌భించింది. దీంతో మొద‌టి

డాక్టర్ సీటు వచ్చింది.. చదువుకుంటా ఆర్థిక సహాయం చేయండి..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ మండ‌లం చిట్యాల గ్రామానికి చెందిన ఆదివాసి ఏక‌ల‌వ్య బిడ్డ ఎస్. ఇందుకి ప్ర‌తిమ ప్రైవేట్ మెడిక‌ల్ క‌ళాశాల వ‌రంగ‌ల్ లో ఎంబీబీఎస్ సీటు ల‌భించింది. దీంతో మొద‌టి సంవ‌త్స‌రం ఫీజు రూ.1.20ల‌క్ష‌లు. అయితే ల‌క్ష 20వేలు చెల్లించే ఆర్థిక స్థోమ‌త లేక‌పోవ‌డంతో దాత‌ల స‌హాయం చేయాల‌ని అభ్య‌ర్థి చేస్తున్నారు. ఇందు త‌ల్లిదండ్రులు రాధిక‌, చెన్న‌ప్ప‌కు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు కావ‌డం గ‌మ‌నార్హం. కూలీ ప‌నులు చేయించుకుంటూ వీరిని చ‌దివించారు. ఈ కుటుంబానికి వ్య‌వ‌సాయ భూములు, ఎలాంటి ఆస్తులు లేవు. రెక్కాడితే గానీ డొక్కాడ‌దు. చిన్న ఇంట్లో ఉంటూ ముగ్గురు కూతుర్ల‌ను గురుకులంలో చ‌దివిస్తున్నారు. పెద్ద కూతురు ఇందు ప‌దో త‌ర‌గతిలో 9.5, ఇంట‌ర్ లో 950 మార్కులు సాధించింది. ప్ర‌భుత్వ గురుకుల క‌ళాశాల‌లో చ‌దువుకుంది. నీట్ లో వ‌చ్చిన మెరిట్ కి ప్ర‌తిమ ప్రైవేట్ మెడిక‌ల్ క‌ళాశాల వ‌రంగల్ లో ఎంబీబీఎస్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం సీటు వ‌చ్చింది. చ‌ద‌వాల‌న్న స‌ర‌స్వ‌తి పుత్రిక ఇందుకు ఆర్థిక ప‌రిస్థితి అడ్డు వ‌స్తోంది. ఇంటి వ‌ద్ద కూలీ ప‌నుల‌కు వెళ్తోంది. ఎవ‌రైనా దాత‌లు ముందుకు వ‌చ్చి ఎంబీబీఎస్ చ‌దువుకు పూర్తి స‌హాయం చేయ‌గ‌ల‌ర‌ని ఆ విద్యార్థిని అభ్య‌ర్థిస్తోంది. దాత‌లు ఆర్థిక స‌హాయం చేయాల‌నుకుంటే 9553628001, 6305646827, 905 99 99 510 ఈనెంబ‌ర్ల‌కు ఆన్ లైన్ పంపించ‌వ‌చ్చు.

Next Story