- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలు ఎక్కువగా ఉన్న డివిజన్ ను ఎస్సీ రిజర్వు ఎలా చేస్తారు..?
బీసీ లు ఎక్కువ జనాభా ఉన్న 18 వ డివిజన్ ను ఎస్సీ సామాజిక వర్గానికి ఎలా రిజర్వు చేస్తారని బీసీ జేఏసి కార్యదర్శి ప్రభాకర్, వీరేశం, నరేష్ లు ప్రశ్నించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీసీ లు ఎక్కువ జనాభా ఉన్న 18 వ డివిజన్ ను ఎస్సీ సామాజిక వర్గానికి ఎలా రిజర్వు చేస్తారని బీసీ జేఏసి కార్యదర్శి ప్రభాకర్, వీరేశం, నరేష్ లు ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో న్యూ మోతీనగర్ 18 వ డివిజన్ ను ఎస్సీ రిజర్వేషన్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ న్యూ మోతీనగర్ నివాసస్తులు ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ న్యూ మోతీనగర్ లో మొత్తం 3600 ఓటర్లు ఉండగా.. అందులో 2600 బీసీ ఓటర్లు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ, బుడగ జంగాలు కలిపి 500 లోపే ఉండగా, ఎస్సీ జనరల్ కు కేటాయించడం బీసీ ల మోసం చేయడమేనని వారు ఆరోపించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచించి బీసీ రిజర్వు డివిజన్ గా ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దినేష్, నగేష్, శేఖర్, మన్యంశీను, యాదగిరి భారీగా పాల్గొన్నారు.






