- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్డు మెంబర్ కి ఎన్ని ఓట్లు పడితే.. సర్పంచ్ కి అన్ని ఓట్లు పడాలి
దిశ, అచ్చంపేట : మూడో విడత అచ్చంపేట నియోజకవర్గం లో జరగనున్న స్థానిక ఎన్నికల పోరులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థుల మీద నమ్మకం లేక ఏకంగా దేవుళ్ళ ముందు

దిశ, అచ్చంపేట : మూడో విడత అచ్చంపేట నియోజకవర్గం లో జరగనున్న స్థానిక ఎన్నికల పోరులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థుల మీద నమ్మకం లేక ఏకంగా దేవుళ్ళ ముందు అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం చేయించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామంలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు కలిసి సర్పంచ్ అభ్యర్థి సభావత్ రాఘవులుతో పాటు వార్డ్ మెంబర్లుగా పోటీలో ఉండే పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తున్నామని వారిచే గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ప్రమాణం చేయించిన వీడియో వైరల్ అవుతోంది. అలాగే పోటీలో ఉండే అభ్యర్థులందరూ ఎలాంటి ప్రలోభాలకు డబ్బుకు లోబడకుండా ఉండి వార్డు మెంబర్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడుతున్నాయో అన్ని ఓట్లు తప్పకుండా సర్పంచ్ అభ్యర్థికి వేయించే బాధ్యత మాదేనంటూ ప్రమాణం చేస్తూ.. ఎన్నికల్లో విజయ డంకా మోగించి ఎమ్మెల్యే కు గిఫ్ట్ గా ఇద్దామని తీర్మానం చేయించారు. అలాగే పార్టీని వీడకుండా గ్రామస్తులతో కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడతామని వారి చేత ఆంజనేయుడు సాక్షిగా ప్రమాణం చేయించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలో స్థానిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మూడో తేదీన నామినేషన్ కి ముందే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి , వార్డు మెంబర్లపై నమ్మకం లేక వారితో ఆంజనేయ స్వామి పై ప్రమాణం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పెద్దలు వారితో ప్రమాణం చేయించినట్టు సమాచారం.






