- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోలీ వేళ.. ఆకతాయిల అల్లరి
మక్తల్ నియోజకవర్గంలో కొంత మంది ఆకతాయిలు రంగులకు బదులు డ్రైనేజీలోని మురుగు నీరును బస్సులో ఉన్న ప్రయాణికులపై, డ్రైవర్, కండక్టర్ పై చల్లి అల్లరి చేశారు.

దిశ, మక్తల్ : హోలీ పండుగ అంటే.. రంగుల పండుగ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మక్తల్ నియోజకవర్గంలో కొంత మంది ఆకతాయిలు రంగులకు బదులు డ్రైనేజీలోని మురుగు నీరును బస్సులో ఉన్న ప్రయాణికులపై, డ్రైవర్, కండక్టర్ పై చల్లి అల్లరి చేశారు. దుర్గంధభరితమైన డ్రైనేజీ నీరు దుర్వాసన వెదజల్లడంతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సమీపంలో ఉన్న కుళాయి వద్ద బట్టలు ఉతుక్కొని వెళ్లిన ఘటన ఊట్కూర్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.
మంగళవారం మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండల కేంద్రంలో హోలీ సందర్భంగా రంగులు అయిపోవడంతో ఆకతాయి పిల్లలు నారాయణ పేట నుంచి మక్తల్ మీదుగా గద్వాల వైపు వెళ్తున్న బస్సు ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీపం వద్దకు రాగానే కొందరూ యువకులు డ్రైనేజీ నీటిని డబ్బాల్లో నింపి బస్సు ప్రవేశ ద్వారా వైపు విసిరారు. డ్రైవర్ కార్తిక్, ప్రయాణికులపై మురుగు నీరు పడి దుర్గందంగా మారింది. దీంతో దాదాపు గంట పాటు బస్సు నిలుచొని ఉంది. ఊరి బయట కొళాయి వద్ద దుస్తులను ఉతుక్కొని ఆరబెట్టుకున్నారు. హోలీ పండుగ వేళ రంగులతో సంతోషంగా ఆడుకోవాలి.. కానీ శృతి మించి పక్క దారి పడరాదని.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని కండక్టర్ ఇమాన్యుల్ తన ఆవేధన వ్యక్తం చేశారు.






