విభిన్న కళల ప్రదర్శనకు 'హ్యాపీ సండే' చక్కటి వేదిక : కమిషనర్ రామానుజుల రెడ్డి

by Ratna Kumari |

వివిధ రంగాల్లోని కళాకారులలో దాగి ఉన్న విభిన్న కళల ప్రదర్శనకు 'హ్యాపీ సండే' కార్యక్రమం ఒక వేదిక అని మున్సిపల్ కార్పోరేషన్ క‌మిషనర్ రామానుజుల రెడ్డి అన్నారు.

విభిన్న కళల ప్రదర్శనకు హ్యాపీ సండే చక్కటి వేదిక :  కమిషనర్ రామానుజుల రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వివిధ రంగాల్లోని కళాకారులలో దాగి ఉన్న విభిన్న కళల ప్రదర్శనకు 'హ్యాపీ సండే' కార్యక్రమం ఒక వేదిక అని మున్సిపల్ కార్పోరేషన్ క‌మిషనర్ రామానుజుల రెడ్డి అన్నారు. 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్టేడియం గ్రౌండ్ కమాన్ వద్ద రోడ్డుపై ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో నగరపాలక మేయర్ మమత శ్రీనివాస్ పాల్గొనగా కమిషనర్ మాట్లాడారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులు తమ తల్లిదండ్రుల తో పాల్గొని డాన్సులు, ఫ్లోక్ సాంగ్స్, మెజిషియన్, కరాటే, యోగా, సీనీ పాటలు, ఆటల తో ఉల్లాసం, ఉత్సాహంగా గడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం ప్రతినిధులు, పట్టణ ప్రజలు, డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Next Story