జీఎస్టీ రద్దు బీమా రంగానికి శుభ పరిణామం

by Elthuri vijay kumar |

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ విధింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం బీమా రంగానికి శుభ పరిణామని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. మద్దిలేటి అన్నారు.

జీఎస్టీ రద్దు బీమా రంగానికి శుభ పరిణామం
X

జీఎస్టీ రద్దు బీమా రంగానికి శుభ పరిణామం

ఎఫ్ డీఐల పెంపు అభివృద్ధికి అవరోధం

ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. మద్దిలేటి

దిశ, జడ్చర్ల : కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ విధింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం బీమా రంగానికి శుభ పరిణామని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. మద్దిలేటి అన్నారు. బుధవారం జడ్చర్ల ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ 40వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ 1956వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరికి జీవిత బీమా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎల్ఐసి సంస్థ గ్రామీణ ప్రజలకు బీమా సదుపాయం కల్పిస్తూ వారి ద్వారా సేకరించిన బీమా డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేస్తున్నదని అన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తూ అటు ప్రభుత్వ, ఇటు ప్రజల ఆదరాభిమానాలను చురగొంటూ ప్రపంచంలోనే ప్రముఖమైన బీమా సంస్థగా పేరు పొందిందని ఆయన అన్నారు. ఏజెంట్ల నిరంతర కృషి, ఉద్యోగుల నిబద్ధత, దేశ ప్రజల ఆదరాభిమానాల కారణంగా ప్రపంచంలో ఆర్థికపరమైన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎల్ఐసి ఒక పటిష్టమైన సంస్థగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో 24 ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా కూడా నేటికీ ఎల్ఐసి అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈమధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై జీఎస్టీల రద్దు భీమా రంగం అభివృద్ధికి ఇంతగానో దోహదపడేదిగా ఉందని ఆయన అన్నారు.

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లను 100 శాతానికి పెంచడం ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లు పెరిగితే దేశ ప్రజల పొదుపుపై విదేశీ సంస్థల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆదేశపు ఆ దేశంలోనే ఉండాలని అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమ యూనియన్ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. భీమా రంగం అభివృద్ధి చెందాలంటే దేశ ప్రజల వద్ద పుష్కలంగా డబ్బుండాలని, అందుకోసం ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు వారికి ఉద్యోగ ఉపాధి కల్పనలను అవసరమైనంత మేర కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా ప్రభుత్వాలు చేసినప్పుడే దేశాభివృద్ధి జరగడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల బ్రాంచ్ ఎస్ బి ఎం ఎల్. శంకర్ నాయక్, ఎబిఎం (సేల్స్) రవీందర్ నాయక్, యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షుడు వి. రాజేశ్వర్, డివిజన్ సంయుక్త కార్యదర్శి కె. గణేష్, డివిజన్ కోశాధికారి వై. యాదగిరిలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ బ్రాంచ్ ల నుండి విచ్చేసిన యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

జడ్చర్ల బ్రాంచ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎంపిక

ఈ సందర్భంగా జడ్చర్ల ఎల్ఐసి బ్రాంచి ఎఐసియూఐ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. బ్రాంచ్ నూతన అధ్యక్షుడిగా కె.అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్. చెన్నయ్య, కార్యదర్శిగా ఎన్.శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా అబ్దుల్ రజాక్, సంగీత బాబురావు, జనరల్ కౌన్సిల్ మెంబర్ గా విక్రమ్ భరద్వాజ్, ఉమెన్ సబ్ కమిటీ సభ్యురాలిగా పావని, కోశాధికారిగా మహమ్మద్ సాబీర్, కార్యవర్గ సభ్యులుగా సాయి రెడ్డి, వెంకట్ రత్నం, నిర్మల, బి.జంగయ్య, ప్రీతంలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

Next Story