నాణ్యతలేని మాంసం విక్రయదారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి : సీపీఎం

by Ratna Kumari |

దిశ,అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మాంసం మార్కెట్లో నాణ్యతలేని, చనిపోయిన గొర్ల మరియు మేకల మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని

నాణ్యతలేని మాంసం విక్రయదారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి :  సీపీఎం
X

దిశ,అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మాంసం మార్కెట్లో నాణ్యతలేని, చనిపోయిన గొర్ల మరియు మేకల మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుకు గురి చేస్తున్న మాంసం విక్రయదారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు మల్లేష్ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ని కలిసి వ్రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదులో వారు తెలియజేసిన విషయం అచ్చంపేట పట్టణంలో మాంసం మార్కెట్లో కొంతమంది దుకాణదారులు చనిపోయిన గొర్లను, మేకలను కట్ చేసి మాంసంగా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అని,ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరం మాత్రమే కాకుండా చట్టవిరుద్ధం కూడా అని వారు తెలియజేశారు. అయితే ఎన్ని సార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు అని, ఈ నిర్లక్ష్య ధోరణిని ప్రభుత్వం తక్షణమే సరిచేయాలి అని స్పష్టంచేశారు.


ప్రస్తుత మార్కెట్లో కేజీ మాంసం ధర రూ.900 నుంచి రూ.1000 వరకు ఉన్నప్పటికీ, ఆ ధరకు సరిపడే నాణ్యత గల మాంసం అందడం లేదు అని తెలిపారు. నాణ్యతలేని మాంసం వల్ల వినియోగదారుల్లో అసహనం పెరుగుతోంది అని ,కొన్ని చోట్ల మాంసం కొనుగోలు విషయంలో తగాదాలు కూడా జరుగుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత అధికారులదే. అయినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వారిపై విచారణ జరిపి, నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి అని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.మాంసం విక్రయ మార్కెట్‌లో తరచుగా తూకం వేయడానికి వాడే తక్కెడ మరియు బాట్లు నకిలీవి వాడుతున్నారు అని , నాణ్యతలేని మాంసం విక్రయాలు జరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు.మాంసం విక్రయ కేంద్రాల్లో శుభ్రత, పరిశుభ్రత కట్టుదిట్టంగా పాటించాలి అని,లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మల్లేష్, శంకర్ నాయక్, రాములు, సయ్యద్, తారా సింగ్ పాల్గొన్నారు.

Next Story