- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి
by Ratna Kumari |
దిశ, బకోడేరు : కోడేరు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో టీచరుగా పనిచేస్తున్న మిద్దె కేశవులు( 37) గుండె పోటు తో గురువారం మృతి చెందాడు. తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు

X
దిశ, బకోడేరు : కోడేరు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో టీచరుగా పనిచేస్తున్న మిద్దె కేశవులు( 37) గుండె పోటు తో గురువారం మృతి చెందాడు. తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గత 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. తోటి టీచర్స్ ఆపరేషన్ ఖర్చులకు కొంత ఆర్థిక సాయం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి స్వగ్రామమైన పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపురం గ్రామానికి చేరుకున్నాడు. గురువారం వాంతులు చేసుకోవడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసేలోపే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం.కేశవులు మృతి పట్ల కోడేరు మండలం టీచర్స్, సిపిఎం, యూటీఎఫ్ సంఘం నాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story






