రూ.100 కే మేక‌పోతు కైవ‌సం..

by Ratna Kumari |

దిశ‌, మిడ్జిల్ : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా మిడ్జిల్ మండ‌ల కేంద్రంలో మ‌ణికంఠ యువసేన ఆధ్వర్యంలో రూ. 100 కొట్టు మేకను పట్టు లక్కీ డ్రా

రూ.100 కే మేక‌పోతు కైవ‌సం..
X

దిశ‌, మిడ్జిల్ : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా మిడ్జిల్ మండ‌ల కేంద్రంలో మ‌ణికంఠ యువసేన ఆధ్వర్యంలో రూ. 100 కొట్టు మేకను పట్టు లక్కీ డ్రా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలో దేవాలయం వద్ద లక్కీ డ్రా తీశారు. ఈ ల‌క్కీ డ్రాలో ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గం కుల్క‌చెర్ల గ్రామానికి చెందిన కుషి గౌడ్ కూప‌ర్ నెంబ‌ర్ 418 కి ల‌క్కి డ్రాలో విజేత‌గా నిలిచాడు. మొద‌టి బ‌హుమ‌తిగా కుషిగౌడ్, రెండో విన్న‌ర్ గా ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గం అంతారం గ్రామానికి చెందిన బ‌జ‌రంగ్ గౌడ్ 12 బీర్లు, మూడో విన్న‌ర్ మిడ్జిల్ మండ‌ల కేంద్రానికి చెందిన బిర్లా స‌త్తి మూడు నాటు కోళ్ల‌ను కైవసం చేసుకున్నారు. గెలుపొందిన విజేతలకు మేకపోతు, కాటన్ బీర్లు, మూడు నాటు కోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మణికంఠ యువసేన సభ్యులు హరి గౌడ్, విజయ్, శివ, బిర్లా నాగయ్య, నరేష్, శ్రీను, శ్రీశైలం, రాము పాల్గొన్నారు.

Next Story