ఘ‌నంగా క్షీర లింగేశ్వ‌ర స్వామి జాత‌ర

by Ratna Kumari |

మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణ మండ‌ల కేంద్రంలో క్షీర లింగేశ్వ‌ర స్వామి జాత‌ర బుధ‌వారం సాయంత్రం భ‌క్తుల శివ నామ‌స్మ‌ర‌ణాల‌తో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఘ‌నంగా క్షీర లింగేశ్వ‌ర స్వామి జాత‌ర
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణ మండ‌ల కేంద్రంలో క్షీర లింగేశ్వ‌ర స్వామి జాత‌ర బుధ‌వారం సాయంత్రం భ‌క్తుల శివ నామ‌స్మ‌ర‌ణాల‌తో ఘ‌నంగా నిర్వ‌హించారు. సంక్రాంతి మ‌క‌ర సంక్ర‌మ‌ణ రోజు క్షీరలింగేశ్వర స్వామి రథోత్సవం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ర‌థోత్స‌వానికి క‌ర్ణాట‌క‌, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాల ప్ర‌జ‌లు విచ్చేశారు. కృష్ణాన‌దిలో ప‌విత్ర స్నానం చేసి స్వామివారిని ద‌ర్శించుకొని మొక్క‌లు తీర్చుకున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేలాదిగా తరలివచ్చిన భక్తజనుల మధ్య జరిగిన రథోత్సవంలో పాల్గొని ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. జాత‌ర వ‌ద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో పక‌డ్బందీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Next Story