ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చాల్సిందే

by Ratna Kumari |

ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టి తరలింపు జరగాలంటే ముందుగా స్థానికంగా ఉన్న గజలమ్మ దేవత ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చిన తర్వాతనే కొనసాగాలంటూ అఖిలపక్షం సమావేశంలో నిర్వహించారు.

ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చాల్సిందే
X

దిశ‌, ధ‌న్వాడ : ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టి తరలింపు జరగాలంటే ముందుగా స్థానికంగా ఉన్న గజలమ్మ దేవత ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చిన తర్వాతనే కొనసాగాలంటూ అఖిలపక్షం సమావేశంలో నిర్వహించారు. సోమవారం ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టి తరలింపు పై వివాదం కొనసాగుతుంది ఒండ్రు మట్టి ని రైతుల పొలాలకు కాకుండా ఇతర మండలాలకు ఇటిక బట్టీల కోసం తరలిస్తున్నారంటూ యువత మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఇది కొనసాగాలంటే ముందుగా పురాతనమైన పూరి దేవత గజలమ్మ ఆలయ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలంటూ అఖిలపక్ష సమావేశంలో నాయకులు నిర్వహించారు. మట్టి తరలింపు చేసే గుత్తేదారు ముందుగా ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చిన తర్వాతనే మట్టి తరలింపును కొనసాగించాలని లేకుంటే అడ్డుకుంటామంటూ సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని గుత్తేదారు దృష్టికి తీసుకుపోతామంటూ పలువురు సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ స‌మావేశంలో యువ‌త ఇర్ఫాన్ అహ్మ‌ద్, జ‌డ‌ల బాల‌రాజు, ప్ర‌కాశ్, శివ ముదిరాజ్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story