- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాతాల్లో నిధులు జమ.. రైతులకు భరోసా..!
రైతాంగమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా లో భాగంగా.. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల లోపు సాగు భూములు ఉన్న రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికీ ఎకరాకు రూ.6వేల చొప్పున జమ చేసింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రైతాంగమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా లో భాగంగా.. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల లోపు సాగు భూములు ఉన్న రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికీ ఎకరాకు రూ.6వేల చొప్పున జమ చేసింది. రైతుబంధు పేరుతో గత ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలు ఇచ్చింది. ఇటీవల కోస్గి సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బును రైతుల ఖాతాలలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటగా ఎకరా లోపు భూములు ఉన్న రైతులకు రైతు భరోసా కింద డబ్బును జమ చేశారు. సోమవారం రెండు ఎకరాల లోపు పొలాలు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,56,078 మంది రైతులకు లబ్ధి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,56, 078 మంది రైతుల ఖాతాలలో మొత్తం 208కోట్ల 14 లక్షల, 26 వేల, 500 రూపాయలు జమ అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 91,248 మంది రైతుల ఖాతాలలో 48,32,76,181 రూపాయలు, నారాయణపేట జిల్లాలో 54,153 మంది రైతుల ఖాతాలలో 34, 34, 73, 497 రూపాయలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 98, 409 మంది రైతులకు గాను 61,79,10, 579 రూపాయలు, వనపర్తి జిల్లాలో 68,587 మంది రైతులకు 34,40,23,950 రూపాయలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 43,681 మంది రైతులకు 29,27,42 293 రూపాయలు జమ అయినట్లుగా అధికారులు వెల్లడించారు. దాదాపుగా రెండు ఎకరాల లోపు పొలాలు ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు సోమవారము జమ కాగా.. మిగతా వారికి ఒకటి రెండు రోజులలో జమ కానున్నాయి.
సాగు భూములు అన్నింటికీ..
సాగు బడిలో ఉన్న భూములు అన్నింటికీ రైతు భరోసా వస్తుంది. ఇప్పటికే ఒక ఎకరా ఉన్న రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ కాగా. రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో సోమవారం నుండి డబ్బులు జమ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి రైతులకు బ్యాంకుల ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. మాకు ఒకటి రెండు రోజులలో వివరాలు అన్నీ అందుతాయి. మిగతా రైతులకు కూడా వీలైనంత త్వరలోనే రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి.






