సెల్ ఫోన్ లైట్ వెలుతురులో విధులు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, అలంపూర్ : గ‌ద్వాల జిల్లా మాన‌వ‌పాడు మండ‌లంలో విద్యుత్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. దీంతో మండ‌ల కార్యాల‌య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగ‌ళ‌వారం

సెల్ ఫోన్ లైట్ వెలుతురులో విధులు..!
X

దిశ‌, అలంపూర్ : గ‌ద్వాల జిల్లా మాన‌వ‌పాడు మండ‌లంలో విద్యుత్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. దీంతో మండ‌ల కార్యాల‌య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగ‌ళ‌వారం క‌రెంట్ కోత‌లు విధించ‌డంతో అధికారులు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో విధులు నిర్వ‌హించారు. కార్యాల‌యంలో ఉన్న జ‌న‌రేట‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక చివ‌రికీ సెల్ ఫోన్ వెలుతురులో భూ భార‌తి రికార్డుల‌ను ఆయా గ్రామాల జీపీఓలు, రెవెన్యూ త‌హ‌శీల్దార్ రెవెన్యూ స‌మ‌క్షంలో ప‌రిశీలించారు. ఈ విష‌యం పై త‌హ‌శీల్దార్ సోషి శ్రీనివాస‌రావును దిశ ప్ర‌తినిధి వివ‌ర‌ణ కోర‌గా.. విద్యుత్ అధికారులు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు క‌రెంట్ క‌ట్ చేయ‌డంతో రిజిస్ట‌ర్లు కూడా కావ‌డం లేద‌ని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి కరెంట్ లేకపోవడంతో తుఫాన్ ప్రభావంతో కార్యాలయం చిమ్మ చీకటిగా మారింది. దీంతో రికార్డులను పరిశీలించే పనిలో సెల్ ఫోన్ లైట్లు వేసుకొని పనులు చేసుకుంటున్నామని తెలిపారు. జనరేటర్ బాగోగు కోసం కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Next Story