ప్లాట్లు ఇప్పిస్తాన‌ని మాజీ స‌ర్పంచ్ డ‌బ్బులు వ‌సూలు..?

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో గత మాజీ సర్పంచ్ గ్రామ కంఠంలో ప్లాట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని లింగాల మండలం పద్మనపల్లి గ్రామస్తులు ఎంపీడీవో, త‌హ‌శీల్దార్ కి ఫిర్యాదు చేశామని ఆదివారం మీడియాకు తెలిపారు.

ప్లాట్లు ఇప్పిస్తాన‌ని మాజీ స‌ర్పంచ్ డ‌బ్బులు వ‌సూలు..?
X

దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో గత మాజీ సర్పంచ్ గ్రామ కంఠంలో ప్లాట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని లింగాల మండలం పద్మనపల్లి గ్రామస్తులు ఎంపీడీవో, త‌హ‌శీల్దార్ కి ఫిర్యాదు చేశామని ఆదివారం మీడియాకు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నేనావత్ దేవి భర్త సేవ్య గత 2 సం.ల క్రితం గ్రామ ప్రజల నుంచి ఒక్కో కుటుంబం దగ్గర రూ.3,000 నుంచి రూ.5,000 వరకు డబ్బులు వసూలు చేసి దాదాపు రెండు లక్షలకు పైగా దండుకున్నారని ఆరోపించారు. గ్రామకంఠం స్థలాన్ని "ప్లాట్లుగా చేసి ప్రతి కుటుంబానికి ఒక్కో ప్లాట్ ఇస్తాను" అని చెప్పి, గ్రామ ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని తదనంతరం ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ప్లాట్ ల రిజిస్ట్రేషన్ సమయంలో స్టేట్ ఎలెక్షన్ కోడ్ అమలులో ఉందని చెప్పి సర్వర్ పని చేయడం లేదని సాకులు చూపుతూ తప్పించుకున్నారు. సుమారు 80 నుంచి 90 మంది గ్రామ ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు రోదిస్తున్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేసి, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలనీ బాధితులు కోరుతున్నారు.

Next Story