- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని సన్మానించిన జడ్చర్ల మాజీ కౌన్సిలర్
ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ తరపున ఆడి సంచలన రికార్డులు సృష్టించి.. యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్న యువ సంచలన క్రికెటర్ వైభవ్ సూర్య వంశీని బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సతీష్ బీహార్ రాష్ట్రంలోని తజ్పూర్ లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు.

దిశ, జడ్చర్ల : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ తరపున ఆడి సంచలన రికార్డులు సృష్టించి.. యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్న యువ సంచలన క్రికెటర్ వైభవ్ సూర్య వంశీని బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సతీష్ బీహార్ రాష్ట్రంలోని తజ్పూర్ లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. వైభవ్ సూర్యవంశిని ఎంతోమంది యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభను బయట పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. యువతకు చిన్న వయసులోనే సూర్య వంశీ మార్గదర్శకంగా నిలవడం అభినందనీయమని సతీష్ కొనియాడారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కుటుంబ సభ్యులు మాజీ కౌన్సిలర్ సతీష్ ను సాదరంగా ఆహ్వానించి వారి ఇంట్లో అల్పాహారం అందించారు. తెలంగాణ నుంచి బీహార్ రాష్ట్రానికి వచ్చి సన్మానించడం తాము ఎప్పటికీ మర్చిపోలేము అని సూర్యవంశీతో పాటు వారి కుటుంబ సభ్యులు తెలిపినట్టు సతీష్ పేర్కొన్నారు.






