- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మం కోసమే పోరాడుతా ముఖ్యమంత్రి జేజమ్మ కూడా నన్నేం చేయలేరు : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్
దిశ, బిజినేపల్లి : ధర్మం కోసమే పోరాడుతానని ముఖ్యమంత్రి జేజమ్మలు కూడా నన్నేం చేయలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల

దిశ, బిజినేపల్లి : ధర్మం కోసమే పోరాడుతానని ముఖ్యమంత్రి జేజమ్మలు కూడా నన్నేం చేయలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరచిందని ఎద్దేవా చేశారు. నల్లమల్ల ముద్దుబిడ్డ మన జిల్లాకు చెందిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే మహబూబ్ నగర్ జిల్లా ఇంతవరకు ఉన్నత స్థాయికి తీసుకొస్తారని కలలు కంటే ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. భారతదేశంలో ప్రధాని మోడీ చేసిన వాగ్దానాల కన్నా పనులు మిన్న.. అందుకే ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ పార్టీ పదేళ్లు పరిపాలించి ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని చేశారు.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గతంలో నల్లమట్టిని అమ్ముకొని నల్లమట్టి దొంగగా మారాడని అతన్ని ఈసారి కాల్చి వాత పెడితే ఓడిపోయారని గుర్తు చేశారు. గువ్వలకు తెలియక బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారని కొందరు ఎద్దేవా చేశారని.. నేను కూడా వారి కంటే తెలివైన వాడినని వారి కంటే ఎక్కువ చదువుకున్న కనుక పార్టీ తీర్థం పుచ్చుకున్నానన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ పై కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మోడీ ప్రభుత్వం వికలాంగులకు రైతులకు యువతకు ఎన్నో పథకాలు ఇచ్చిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కైవాసం చేసుకోవడం ఖాయమని అన్నారు బీజేపీ డబ్బులకు అమ్ముడు పోయే పార్టీ కాదని అన్నారు. దేశంలోనే పనికిరాని పార్టీ ఏదైనా ఉందే అంతే అది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకొని పని చేస్తే వారే సైనికులు అవుతారని ఈ సందర్భంగా తెలిపారు స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ కన్న ఎక్కువ సీట్లు మనమే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. నా చివరి శ్వాస ఉన్నంతవరకు నేను బిజెపి లోనే ఉంటానని తెలిపారు. ఒకటి నుంచి తాటాకు చప్పట్లకు భయపడేది లేదని అన్నారు. అంతకముందు మండల కేంద్రంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున యువత బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప చారి, బుసిరెడ్డి. సుధాకర్ రెడ్డి, భూషయ్య, శ్రీరామ్, చంద్రకళ, తిరుపతయ్య ,నారాయణచారి, సత్యనారాయణ ఉన్నారు.






