- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంట్లో నుంచి ఎగిసి పడుతున్న మంటలు.. వెళ్లి చూడగా అందరూ షాక్..
by Naveena |

X
దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ మహిళ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లికి చెందిన లక్ష్మి (48) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుందని తెలిపారు. దీంతో గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ఘటనపై కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు బిజినేపల్లి రెండవ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Next Story