రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Ratna Kumari |

దిశ, వీపనగండ్ల: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్అండ్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, వీపనగండ్ల: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్అండ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బొల్లారం, వీపనగండ్ల, గోవర్ధనగిరి లో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో పండించిన పంటకు మద్దతు ధర అందిస్తూ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏ గ్రేడ్ వడ్లకు 2,389 రూపాయలు, కామన్ గ్రేడ్ రకానికి 2,369 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగిందని, అంతేగాక సన్న రకం ధాన్యానికి క్వింటాలు 500 రూపాయలు బోనస్ కూడా అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, పార్టీ సీనియర్ నాయకులు రావుల నారాయణరెడ్డి, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు ఎత్తం చిట్టెమ్మ, ఏపిఎం మద్దిలేటి, సీసీలు ఉన్నారు.

Next Story